నేడు మిధున్ రెడ్డి పిటీషన్ పై విచారణ
వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి పిటీషన్ పై నేడు విచారణ కొనసాగనుంది.
వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి పిటీషన్ పై నేడు విచారణ కొనసాగనుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు తనకు హాజరయ్యేందుకు అనుమతి కావాలని మిధున్ రెడ్డి పిటీషన్ వేశారు. దీనిపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ సాగనుంది. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మిధున్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
బెయిల్ పై ఉండటంతో...
ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. అయితే వచ్చే నెల నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానుండటంతో ఆ సమావేశాలకు హాజరయ్యేందుకు తనను అనుమతించాలని ఆయన పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించి ఏసీబీ న్యాయస్థానం తీర్పు వెలువరించే అవకాశముంది.