Midhun Reddy : నేడు మిధున్ రెడ్డి బెయిల్ పైవిచారణ
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మధ్యంతరబెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి మధ్యంతరబెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన మిథున్‌రెడ్డి పిటీషన్ వేశారు. మిథున్‌రెడ్డి పిటిషన్‌పై విచారించనున్ననేడు ఏసీబీ కోర్టు విచారించనుంది. ఇప్పటికే ఏ 30 నిందితుడికి ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది.
లిక్కర్ స్కామ్ కేసులో...
మరొకవైపు నేడు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడుగా ఉన్న ధనుంజయ్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. లిక్కర్ కేసులో అరెస్టయిన ధనుంజయ్‌రెడ్డి గతకొంతకాలంగా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నేడు ధనుంజయ్‌రెడ్డి బెయిల్‌పై విచారించనున్న ఏసీబీ న్యాయస్థానం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.