నేడు ఏపీ ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంలో విచారణ
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమ తవ్వకాలపై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇసుక అక్రమ తవ్వకాలపై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. జగన్ హయాంలో రూ.1,467 కోట్ల విలువైన ఇసుక దోపిడీ జరిగిందని ప్రభుత్వం అఫడవిట్ దాఖలు చేయడంతో దీనిపై విచారించనుంది. దాదాపు రూ.1.22 కోట్ల టన్నుల ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని పేర్కొంది. 2019 నుంచి 2024 వరకూ జరిగిన ఇసుక దోపిడీపై పెద్దయెత్తున అవినీతి జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తుంది.
ఏపీ ప్రభుత్వం అఫిడవిట్...
ఈ మేరకు సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పనుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. జగన ప్రభుత్వం ఇసుక దోపిడీపై విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.