బ్రహ్మచారిగా బతికాడు.. మహా వృక్షాలను భవిష్యత్తు తరాలకు ఇచ్చాడు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెం గ్రామానికి చెందిన దారం వెంకటరెడ్డి భౌతికంగా మన దగ్గర లేకపోయినా చెట్ల రూపంలో బతికే ఉన్నారు.
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగంబొట్లపాలెం గ్రామానికి చెందిన దారం వెంకటరెడ్డి భౌతికంగా మన దగ్గర లేకపోయినా చెట్ల రూపంలో బతికే ఉన్నారు. ఆయన నాటిన చెట్ల నుంచి వీచే గాలులు ఆయన్ను గుర్తుచేస్తూనే ఉన్నాయి. 1990, 1991 సంవత్సరాల మధ్యకాలంలో వెంకటరెడ్డి, దర్శి-చీమకుర్తి రోడ్డులోని తాళ్లూరు అడ్డరోడ్డు నుంచి గంగవాగు వరకు సుమారు కిలో మీటర్ల దూరం మేర 200 మర్రి మొక్కలు నాటారు. ఆ తర్వాత రోజూ సమీపంలోని దేవాలయం నుంచి బిందెతో నీరు తీసుకెళ్లి పోసేవారు. ఆ మొక్కలే మహావృక్షాలై ఉన్నాయి. 2014లో కన్నుమూసే సమయానికి ఆయన వయసు 77 సంవత్సరాలు. బ్రహ్మచారిగానే ఉండిపోయారు. ఇక్కడే కాకుండా ఇంకా వివిధ చోట్ల ఆయన 1,000కి పైగా మొక్కలు నాటారని స్థానికులు చెబుతారు.