Andhra Pradesh : వారికి ఏపీ డీజీపీ వార్నింగ్

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు

Update: 2025-10-16 04:29 GMT

సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. వ్యక్తులు, వ్యవస్థల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, దురుద్దేశాలు ఆపాదిస్తూ, అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించేలా, అనుచిత, విద్వేషపూరిత పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచా రాలు చేస్తున్న కొందరిని ఇప్పటికే గుర్తించామన్న డీజీపీ తప్పుడు వార్తలు ప్రచారం చేయడమూ నేరమేనని చెప్పారు.

సోషల్ మీడియాలో...
సామాజిక మాధ్యమ పోస్టుల ద్వారా సమాజంలో ఉద్రిక్తతలు సృష్టించేందుకు యత్నించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హరీష్ కుమార్ గుప్తా వార్నింగ్ ఇచ్చారు. ఎంతటి పెద్ద వ్యక్తులైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, సామాజిక మాధ్యమాలపై నిరంతర నిఘా ఉందని, వాస్తవాలకు విరు ద్ధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా, పోలీసు శాఖను అపఖ్యాతిపాలు చేసేలా పోస్టులు పెట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఏదైనా సమా చారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంపించే ముందు నిజానిజాలు నిర్ధా రించుకోవాలి. లేకపోతే చట్టపరమైన చిక్కులు తప్పవని హరీష్ కుమార్ గుప్తా అన్నారు.


Tags:    

Similar News