పవన్ కు లేఖ.. ఒకరు ఇవ్వడం మరోకరు దేహీ అనడం పొత్తు ధర్మమా?

మాజీ మంత్రి హరిరామ జగయ్య పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. ఒకరు ఇవ్వడం

Update: 2024-02-25 09:54 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఒకే వేదికపై నుంచి శనివారం ఇరు పార్టీల అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. జనసేన 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. జనసేన పార్టీకి మొత్తం 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అయితే అంత తక్కువ సీట్లు జనసేనకు కేటాయించడాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు.. జనసేన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇలాంటి సమయంలో మాజీ మంత్రి హరిరామ జగయ్య పవన్ కళ్యాణ్ కు లేఖ రాశారు. ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అనడం పొత్తుధర్మం అనిపించుకుంటుందా అని పవన్ కళ్యాణ్ ను సూటిగా ప్రశ్నించారాయన. జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అంటూ వ్యాఖ్యానించారు. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని పవన్‌ చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ఏ ప్రాతిపదికన సీట్ల పంపకం చేశారంటూ ప్రశ్నలు కురిపించారు. జనసైనికులు సంతృప్తి చెందేలా సీట్ల పంపకం ఉందా? అని అడిగారు. జనసేన 24సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా? జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా.. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా.. ఓట్ల సంక్షోభానికి ఏది తెర? అని ప్రశ్నించారు. జనసైనికులకు కావలసింది ఎమ్మెల్యే సీట్లు కాదు, పవన్‌ అధికారం చేపట్టడమని అన్నారు. చెరో రెండున్నరేళ్లు సీఎం పదవి, చెరిసగం మంత్రిపదవులు దక్కాలి.. అలా ప్రకటన వస్తేనే ఓట్ల సంక్షోభానికి తెర దించగలమని హరిరామ జోగయ్య లేఖలో వెల్లడించారు.


Tags:    

Similar News