నేడు గుంటూరు మేయర్ ఎన్నిక
నేడు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక జరగనుంది.
నేడు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక జరగనుంది. మేయర్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే గుంటూరు మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్రను తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ఎంపిక చేసింది.
వైసీపీ నుంచి బరిలోకి...
మరొకవైపు వైసీపీ నుంచి బరిలో అచ్చాల వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. ఉదయం పదకొండు గంటలకు గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక జరగనుంది. మొత్తం అరవై మూడు మంది సభ్యుల్లో ముప్ఫయి రెండు మంది మాత్రం ఉంటేనే కోరం ఉన్నట్లు తేలింది. 32 మంది లేకుంటే మరుసటి రోజుకు వాయిదా.. మేయర్ పీఠం తమదేనంటూ కూటమి నేతల ధీమాగా ఉన్నారు.