Andhra Pradesh : నేడు గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ లో నేడు జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యధాతధంగా జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో నేడు జరగనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యధాతధంగా జరగనున్నాయి. పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు త్వరగా చేరుకుని పరీక్ష రాయాలని కోరారు.ఈరోజు ఉదయం పది గంటల నుంచి 12.30 గంటల వరకూ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష 1 నిర్వహించడం జరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారులు తెలిలపారు. ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేయాలని కోరినా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ప్రభావం చూపేలా నిర్ణయం తీసుకోలేమని చెప్పి పరీక్షలను వాయిదా వేయకుండా యధాతధంగా జరుపుతున్నారు.
మధ్యాహ్నంపరీక్ష...
అలాగే మధ్యాహ్నం నుంచి పేపర్ 2 పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకూ పరీక్ష జరుగుతుందని చెప్పారు. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.