కుదుటపడుతున్న గవర్నర్ ఆరోగ్యం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ మేరకు ఎఎంజీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈ మేరకు ఎఎంజీ ఆసుపత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇటీవల గవర్నర్ హరిచందన్ అనారోగ్యంతో ఏఎంజీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు అక్కడ వారం రోజుల నుంచి చికిత్స అందిస్తున్నారు.
పోస్ట్ కోవిడ్...
గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అన్నీ పరీక్షలు నిర్వహించామని ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఏఎంజీ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.