నేడు మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు

నేడు మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. ఈరోజు సాయంత్రం మూడు గంటలకు సచివాలయంలో చర్చలు జరగనున్నాయి

Update: 2024-01-10 01:56 GMT

నేడు మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం మరోసారి చర్చలు జరపనుంది. ఈరోజు సాయంత్రం మూడు గంటలకు సచివాలయంలో మున్సిపల్ కార్మికుల సంఘాలతో మంత్రులు చర్చించనున్నారు. సచివాలయంలోని రెండో బ్లాక్ లో ఈ చర్చలు జరగనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువవుతుండటం, సంక్రాంతి పండగ సమీపిస్తున్న తరుణంలో సమ్మెను మున్సిపల్ కార్మికులు విరమించాలని ప్రభుత్వం కోరుతుంది. తమ డిమాండ్లను నెరవేర్చితేనే విరమిస్తామని కార్మిక సంఘాలు చెబుతున్నాయి.

రెండు వారాల నుంచి...
గత రెండు వారాల నుంచి ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తుండటంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. దుర్గంధం నెలకొంది. పట్టణాల్లో పరిస్థిితి మరీ తీవ్రంగా మారింది. వ్యాధులు సంక్రమించే అవకాశాలున్నాయని వైద్యులు కూడా చెబుతున్నారు. చెత్త పేరుకుపోవడంతో దోమల తీవ్రత కూడా ఎక్కువగా మారింది. ఈ నేపథ్యంలో గత కొన్ని దఫాలుగా జరిగిన చర్చలు ఈసారైనా సఫలం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘలు కొంత దిగి వస్తే బాగుంటుందన్న సూచనలు వెలువడుతున్నాయి.


Tags:    

Similar News