Talliki Vandanam L తల్లులకు గుడ్ న్యూస్.. వారికి కూడా తల్లికి వందనం పథకం
తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం తేదీని నిర్ణయించింది
తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల విడుదలకు ప్రభుత్వం తేదీని నిర్ణయించింది. జులై 10వ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయాలని డిసైడ్ చేసింది. ఇప్పటికే ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేసింది. మొదటి విడతలో మత్తం 67 లక్షల మంది వరకూ లబ్ది పొందారు.
రెండో దశలో...
ఈ పథకం కింద ఏడాదికి పదమూడు వేల రూపాయల నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది. జులై 10వ తేదీ నుంచి తొలి విడతలో నిధులు జమ కాని వారితో పాటుగా ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ ఫస్టియర్ లో చేరే వారికి రెండో విడత నిధులను జమ చేయనున్నారు. ఇంటర్మీడియట్ ప్రవేశాలు పూర్తి కావడంతో రెండో విడత 4.7 లక్షల మంది మొదటి సంవత్సరం, 5.5 లక్షల మంది ఒకటో తరగతిలో చేరే అవకాశముందని అంచనా వేస్తూ ఆ మేరకు నిధులను సిద్ధం చేస్తున్నారు.