Andhra pradesh : చంద్రబాబుపై పరువు కేసు.. సీఐకి ఊస్టింగ్
చంద్రబాబుపై పరువు నష్టం కేసు దాఖలు చేసిన సీఐ శంకయ్యను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది
పులివెందులలో మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన 2019 మార్చిలో అక్కడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన జె. శంకరయ్యను ప్రభుత్వం సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది. చారు. కేసు విచారణ సాగుతున్న సమయంలో ఆయనను కర్నూలు రేంజ్‌కు చెందిన వెకెన్సీ రిజర్వ్‌లో ఉంచారు. కొన్ని నెలల క్రితం శంకరయ్య, ముఖ్యమంత్రి ఎన్టీ. చంద్రబాబు నాయుడికి పరువు నష్టం హార నోటీసు పంపిన విషయం తెలిసిందే.
పోలీసుల విచారణలో...
కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో, రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు శంకరయ్యను పోలీసు సర్వీస్ నుండి తొలగించినట్టు తెలిపారు. వివేకానందరెడ్డి నివాసంలో జరిగిన హత్య సమయంలో సాక్ష్యాల సంరక్షణలో శంకరయ్య విఫలమయ్యారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. తెలుసుకున్న వివరాల ప్రకారం, ముఖ్యమంత్రి పై నోటీసు జారీ చేయడం పోలీసు శాఖ నియమావళికి విరుద్ధమని కూడా అధికారులు భావించి శంకరయ్యను సర్వీసు నుంచి తొలగించినట్లు తెలిసింది.