కోటప్పకొండ రోప్ వేకు టెండర్లు
కోటప్పకొండ ఆలయాన్ని అన్ని రకాలుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
కోటప్పకొండ ఆలయాన్ని అన్ని రకాలుగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతున్న కోటప్ప కొండ పైన మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. అత్యధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో పాటు రహదారి సౌకర్యం ఏర్పాటు చేసిన ప్రభుత్వం పర్యాటకరంగంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది.
1.28 కిలోమీటర్లు...
ఇందుకోసం నరసరావుపేట మండలం కోటప్పకొండలో దిగువ నుంచి ఎగువకు రోప్ వే నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించారు. రాష్ట్రంలో ఐదు ప్రాంతాలలో పర్యాటక రంగ అభివృద్ధికి నిర్మించేందుకు కేంద్రం సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీ కన్సల్టెన్సీ సర్వీసుల కోసం టెండర్లను ఆహ్వానించారు. పల్నాడు జిల్లాలోని కోటప్పకొండకు ఈ ప్రాజెక్టులో భాగంగా కొండపైకి 1.28 కిలో మీటర్లు నిర్మించాలని డీపీఆర్ తయారీలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.