శ్రీశైలం ఎమ్మెల్యేపై ప్రభుత్వం సీరియస్
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. విచారణకు ఆదేశించింది.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై ప్రభుత్వం సీరియస్ గా ఉంది. అటవీ శాఖ అధికారులపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు సీరియస్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జరిగిన ఘటనపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విచారణకు ఆదేశం...
తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదిక ఇవ్వాలని కూడా కోరారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సయితం ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేయడం అమానుషమని, దోషులను శిక్షించాలని ఆయన ట్వీట్ చేశారు.