Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబు పై విచారణ
మాజీ మంత్రి అంబటి రాంబాబు పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
మాజీ మంత్రి అంబటి రాంబాబు పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అంబటి రాంబాబుపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ కు ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం నుంచి విచారణ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. జగనన్న కాలనీల పేరుతో ఎకరానికి పది లక్షలకు కొనుగోలు చేసి ప్రభుత్వానికి ముప్ఫయి లక్షల రూపాయలకు విక్రయించడంపై కూడా ఫిర్యాదులు అందాయి.
నియోజకవర్గంలో...
దీంతో పాటు నియోజకవర్గంలోని ప్రజల వద్ద నుంచి పెద్దయెత్తున ముడుపులు స్వీకరించారని కూడా ఫిర్యాదులు అందాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని, ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. రియల్ వెంచర్లలో ల్యాండ్ కన్వర్షన్ విషయంలోనూ అంబటి రాంబాబు నాటి ప్రభుత్వంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఫిర్యాదులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.