Andhra Pradesh : స్మార్ట్ మీటర్లపై విచారణకు ఆదేశం

స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Update: 2025-06-08 05:25 GMT

స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. స్మార్ట్ మీటర్ల కారణంగా ఎక్కువగా విద్యుత్తు బిల్లులు వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్మార్ట్ మీటర్లపై విచారణకు ఆదేశించింది. మీటర్ల లోపమా? లేక విద్యుత్తు వాడకం ఎక్కువగా ఉందా? అన్న దానిపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.

ఎక్కువ బిల్లులు వస్తున్నాయని...
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్లను బిగించారు. అయితే ఈ నెల బిల్లు ఎక్కువగా వస్తుందని ఫిర్యాదు రావడంతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచారణకు ఆదేశించారు. ప్రజలకు తక్కువ ఖర్చుతోనే విద్యుత్తును అందించాలని ప్రభుత్వం భావిస్తుందని, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.


Tags:    

Similar News