School Holidays : వచ్చే ఏడాది పాఠశాలలకు సెలవులివే

వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలకు సెలవులను అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది

Update: 2025-05-23 07:29 GMT

వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలకు సెలవులను అధికారికంగా ప్రభుత్వం ప్రకటించింది. పండగలతో పాటు వేసవి సెలవులు అన్నీ కలిపి అధికారికంగా ప్రకటన చేసింది. పాఠశాలలు ఆంధ్రప్రదేశ్ లో 233 రోజులు పని చేస్తాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. 2025-26 అకడమిక్ కేలండర్ లో పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. 1నుంచి ఐదో తరగతులకు ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే' అమలు చేయనున్నట్లు వెల్లడించింది.

వచ్చే విద్యాసంవత్సరంలో...
దీని ప్రకారం వచ్చే విద్యా సంవ త్సరానికి సంబంధించిన దసరా సెలవులు సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు ఉంటాయని చెప్పింది. సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 18 వరకు ఉంటాయని తెలిపింది. మైనారిటీ విద్యా సంస్థలకు దసరా సెలవులు సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 2 వరకు, క్రిస్మస్ సెలవులు డిసెంబరు 21 నుంచి 28 వరకు ఇవ్వనున్నట్లు చెప్పింది.


Tags:    

Similar News