Andhra Pradesh : ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభిజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ లోని సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభిజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల సెక్రటరీలను సర్దుబాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2500 లోపు జనాభా ఉన్న గ్రామాలకు ఇద్దరు కార్యదర్శులను నియమించారు. 2501 నుంచి 3500 జనాభా వరకూ ఉన్న గ్రామాలకు ముగ్గురు సెక్రటరీలను నియమించింది. సాధారణ విధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సర్దుబాటు చేస్తూ...
అలాగే 3,500 జనాభా పైన ఉన్న గ్రామాలకు మాత్రం నలుగురు సెక్రటరీలు ఉండేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సచివాలయం సెక్రటరీలకు పని విభజన చేయాలని భావించిన ప్రభుత్వం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నియమించి సచివాలయం కార్యదర్శులను వివిధ శాఖల్లో నియమించి వారిచేత విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం తాజాగా సచివాలయం సెక్రటరీలను సర్దుబాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.