నవంబరు 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం

ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Update: 2022-09-23 04:53 GMT

ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నవంబరు 1వ తేదీ నుంచి ఈ నిషేధం అమలులోకి రానుంది. ఇకపై ఫ్లెక్సీలు వాడాలంటే బట్టలతో తయారు చేసినవే వాడాల్సి ఉంటుంది. ఇటీవల విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు పెట్టడానికి వీలు లేదని తెలిపింది.

ఫ్లెక్సీకి రూ.100లు జరిమానా...
ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వినియోగించకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదేనని ఆయన తెలిపారు ప్లాస్టిక్ ఫ్లెక్సీలను ప్రింట్ చేయడం, రవాణా చేయడం, వినియోగించడం, ప్రదర్శించడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. మున్సిపాలిటీలు, పంచాయతీలు, పోలీసులు, రవాణా, జీఎస్టీ అధికారులు ప్లాస్టిక్ ఫ్లెక్సీలను వాడకుండా చూడాలని కోరారు. ఈ బాధ్యతను వారికి అప్పగించారు. ఒకవేళ నిబంధనలను ఉల్లంఘిస్తే ఫ్లెక్సీకి రూ.100లు జరిమానా విధిస్తామని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


Tags:    

Similar News