నెల్లూరు జిల్లా వాసులకు గుడ్ న్యూస్

నెల్లూరు జిల్లా ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. పెన్నా నదిపై రెండో వంతెన నిర్మాణాన్ని చేపట్టబోతుంది.

Update: 2022-10-05 06:31 GMT

నెల్లూరు జిల్లా ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. పెన్నా నదిపై రెండో వంతెన నిర్మాణాన్ని చేపట్టబోతుంది. 100 కోట్ల రూపాయల వ్యయంతో పెన్నా నదిపై రెండో బ్రిడ్జి నిర్మాణానికి ఈరోజు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి భూమి పూజ చేశారు.

రెండో బ్రిడ్జి నిర్మాణానికి...
రెండో బ్రడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తొలగిపోతుందని అభిప్రాయపడ్డారు. నెల్లూరు నగరంలోకి వచ్చేందుకు కేవలం ఒకే ఒక వంతెన ఉండటంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రెండో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని వారు తెలిపారు. సుమారు 75 ఏళ్ల తర్వాత రెండో బ్రిడ్జి నిర్మాణం నెల్లూరు నగరవాసుల కోసం పెన్నా నదిపై నిర్మిస్తున్నట్లు వారు తెలిపారు


Tags:    

Similar News