రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

గోదావరి డెల్టా వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేడు గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేయనుంది

Update: 2025-06-01 02:47 GMT

గోదావరి డెల్టా వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నేడు గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేయనుంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నిటీని విడుదల చేయనున్నారు. ముందుగానే సాగునీటిని ధవళేశ్వరం బ్యారేజీ నుంచి నీటి నుంచి విడుదల చేస్తారు. ఉదయం పదకొండు గంటలకు నీటిని విడుదల చేస్తారు. ఈ ఏడాది వర్షాలు ఎక్కువ పడతాయని భావించి ముందుగానే నీటిని విడుదల చేయనున్నారు.

నేడు సాగు నీటి విడుదల...
గోదావరి డెల్టాలోని మూడు కాల్వలకు పూజా కార్యక్రమాలను నిర్వహించి నీటిని విడుదల చేయనున్నారు. అయితే గోదావరి డెల్టా ఆధునికీకరణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో వాటిని పనులు నిలిపి వేసి మరీ నీటిని ముందుగా విడుదల చేయనున్నారు. ఈ సాగునీటి విడుదలతో 10.13 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుంది.


Tags:    

Similar News