Amravathi : అమరావతి ప్రాంత వాసులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రాజధాని నిర్మాణ పనులు వేగంగా ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సంబంధించి టెండర్లను కూడా ఆహ్వానించింది. ఈ నెల 17 వ తేదీ ఆఖరి తేదీ కావడంతో బడా కంపెనీలు ఈ టెండర్లలో పాల్గొనే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి.
రహదారి నిర్మాణానికి...
ఇక రాజధాని అమరావతికి వెళ్లే రహదారుల నిర్మణానికి సంబంధించి కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి సీడ్ క్యాపిటల్ నుంచి జాతీయ రహదారి 16వ నెంబరు రోడ్ కునిర్మాణం త్వరలో ప్రారంభమవుతుంది. ఆగిపోయిన సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణం పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.