రాజధాని అమరావతి వాసులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వాసులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని గ్రామాలకు రిజిస్ర్టేషన్ విలువ పెంపు ఉండదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుండి కొత్త రిజిస్ర్టేషన్ విలువలు అమల్లోకి వస్తాయని, కానీ రాజధాని గ్రామాల్లో మాత్రం రిజిస్ట్రేషన్ విలువల్లో ఎలాంటి మార్పు ఉండదని ఆయన తెలిపారు. దీనివల్ల పది రెట్లు అదనంగా విలువలు పెరుగుతాయని చెప్పారు.
భూకుంభకోణాలకు...
భూ కుంభకోణాలకు పాల్పడిన అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. త్వరలో తల్లికి వందనంతోపాటు మిగిలిన హామీలు అమలుచేస్తామని ఆయన చెప్పారు. దావోస్ పర్యటన ద్వారా రాష్ర్టంలో 20 లక్షలకు మించి ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రయత్నాలు జరిగాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.