Andhra Pradesh : ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. యూరియా వచ్చేస్తుంది

ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎరువుల అవసరాలపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు

Update: 2025-08-26 02:39 GMT

ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎరువుల అవసరాలపై కేంద్ర ప్రభుత్వంతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు అత్యవసరంగా యూరియా పంపాలని కోరారు. రాష్ట్రంలో ఎరువులు దొరకక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే తమకు యూరియాను పంపాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

నలభై ఐదు వేల మెట్రిక్ టన్నులు...
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై చాలా రోజులయినప్పటికీ యూరియా కొరతతో రైతులు ఇబ్బందులతో ఉన్నందున వెంటనే యూరియా కొరత తీర్చాలని అచ్చెన్నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గంగవరం పోర్ట్‌కి సెప్టెంబర్ ఆరో తేదీన 15 వేల మెట్రిక్ టన్నుల యూరియా కాకినాడ పోర్ట్‌కి సెప్టెంబర్ రెండో వారంలో 30 వేల మెట్రిక్ టన్నుల యూరియా రానున్నట్టు కేంద్రం హామీ ఇచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


Tags:    

Similar News