మామిడి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

మామిడి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మామిడి పంటకు మద్దతు ధరపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2025-06-03 12:30 GMT

మామిడి రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మామిడి పంటకు మద్దతు ధరపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిలో మామిడికి పన్నెండు చెల్లించాలని గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలను ప్రభుత్వం ఆదేశించింది. చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి ప్రసిద్ధి. అయితే గాలి వానతో ఈసారి పంట దెబ్బతినడంతో పాటు జ్యూ స్ ఫ్యాక్టరీలు కూడా సరుకును తీసుకోకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు.

కొనుగోలు చేయాలంటూ...
చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.సమావేశంలో రైతు సంఘాలు, గుజ్జు పరిశ్రమల యజమానులు, వ్యాపారులు పాల్గొన్నారు. మామిడి రైతుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. తీసుకెళ్లడంతో సీఎం ఆదేశాలతో చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ చర్యలు ప్రారంభించారు.


Tags:    

Similar News