తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్
తిరుపతి వెళ్లే భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది
తిరుపతి వెళ్లే భక్తులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలకు ప్రతి రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి రైళ్లు, బస్సుల ద్వారా తిరుపతికి చేరుకుని అక్కడి నుంచి తిరుమల దర్శనానికి వెళుతుంటారు. ఇప్పటికే తిరుపతి రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులను కేంద్ర రైల్వే శాఖ ప్రారంభించింది. పనులు వేగంగా జరుగుతున్నాయి.
బస్టాండ్ ఆధునికీకరణ...
ఇక తిరుపతిలో త్వరలో తిరుపతిలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమలకు వచ్చే భక్తులకు అనేక వసతులు ఒకే చోట లభించేలా తిరుపతిలో ప్రస్తుతమున్న బస్టాండ్ స్థానంలో ఇంట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో బస్టాండ్, దానిపై పది అంతస్తుల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, తదితరాలకు కేటాయించేలా నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేశారు