శ్రీవారి భక్తులకు శుభవార్త.. రేపు స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల
డిసెంబరు నెలలో శ్రీవారిని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్న భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబర్ నెలకు..
tirumala special entry darshan tickets for december
కలియుగ వైకుంఠధామంగా పేరుగాంచిన తిరుమల కొండపై వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని .. దర్శించుకునేందుకు ప్రతినిత్యం దేశ నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. డిసెంబరు నెలలో శ్రీవారిని దర్శించుకునేందుకు సిద్ధమవుతున్న భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. డిసెంబర్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక టికెట్ల కోటాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది టీటీడీ.
ఇకపై దర్శనం టికెట్లను ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలని సూచించింది టిటిడి. డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300 దర్శనం టికెట్లను రేపు (నవంబర్ 11) ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంచనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ అధికారిక వెబ్ సైట్లో దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.