Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ.. ఇక అడిగినవారికి అడిగనన్ని

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. తిరుమలలో భక్తులు ఎన్ని లడ్డూలు కావాలన్నా పొందే వీలు కల్పించింది

Update: 2024-12-05 02:12 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇక తిరుమలలో భక్తులు ఎన్ని లడ్డూలు కావాలన్నా పొందే వీలు కల్పించింది. అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం అదనపు లడ్డూలను తయారు చేయాలని కూడా నిర్ణయించింది. ప్రతి రోజూ అరవై వేల మందికి పైగానే భక్తులు తిరుమలకు చేరుకుంటారు. మొక్కులు చెల్లించుకుని, శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత ప్రధానంగా వారు కోరుకునేది తిరుమల లడ్డూ ప్రసాదాన్ని. కేవలం ఏపీ, తెలంగాణ నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. వారంతా శ్రీవారి లడ్డూ కోసం క్యూ కడతారు.

అదనపు లడ్డూలు...
తిరుమల లడ్డూల కౌంటర్ వద్ద కూడా దర్శనానికి ఉన్నంత రద్దీ ఎప్పుడూ ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం అనేక కౌంటర్లు ఏర్పాటు చేసినప్పటికీ లడ్డూను తమ ఇంటికి తీసుకెళ్లి ప్రసాదాన్ని పది మందికి పంచి పెట్టేందుకు వీటిని కొనుగోలు చేయడం సంప్రదాయంగా వస్తుంది. అందుకే తిరుమల లడ్డూకు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి. లడ్డూ రుచి కూడా అలాగే ఉంటుంది. ఎంత తిన్నా తినాలనిపించే తిరుమల లడ్డూ విషయంలో టీటీడీ మొన్నటి వరకూ కొన్ని రకాల నిబంధనలు విధించింది. శ్రీవారిని దర్శించకున్న వారికి ఒక లడ్డూను ఉచితంగా దేవస్థానం అందచేస్తుంది. అయితే ఇకపై డబ్బుచెల్లించి కోరినన్ని లడ్డూలను ఇచ్చేందుకు సిద్ధమవుతుంది.
ప్రతి రోజుకు...
ప్రస్తుతం రోజుకు మూడున్నర లక్షల చిన్న లడ్డూలు, ఆరు వేల పెద్ద లడ్డూలను ప్రతి రోజూ తయారు చేస్తారు. దీంతోపాటు3,500 వడలను కూడా తయారు చేస్తారు. వీటిని ఇతర ప్రాంతాల్లోనూ విక్రయిస్తున్నారు. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, తిరుపతిలో కూడా విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో రోజప అదనంగా మరో యాభై వేల చిన్న లడ్డూలు, నాలుగువేల పెద్దలడ్డూలు, మరో 3,500 వడలను తయారు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం శ్రీవారి పోటులో అదనపు సిబ్బందిని కూడా నియమించనున్నారు. అయితే వీటికి డబ్బులను చెల్లించి ఎన్ని లడ్డూలనైనా కొనుగోలు చేస్తే వీలు కల్పించేలా తిరుమల తిరుపతి దేవస్థానంనిర్ణయం తీసుకుంది.




Tags:    

Similar News