మళ్లీ పెరుగుతున్న గోదావరి

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వరదల కారణంగా గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతుంది

Update: 2022-08-17 01:54 GMT

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వరదల కారణంగా గోదావరికి మళ్లీ వరద పోటెత్తుతుంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ప్రస్తుతం ధవళేశ్వరం బరాజ్ వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 14.20 లక్షల క్యూసెక్కులుగా ఉంది. దీంతో కోనసీమ ప్రాంతంలోని పలు గ్రామాలు నీట మునిగే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే సహాయక చర్యల్లో మూడు ఎస్డీఆర్ఎఫ్, మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలున్నాయని ఏపీ విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు.

యాంత్రాంగం అప్రమత్తం....
కోనసీమ అంబేద్కర్ జిల్లా పి. గన్నవరం, అయినవిల్లి, మామిడికుదురు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూన వరం, వీఆర్ పురం, ఏలూరు జల్లాలో జంగారెడ్డి గూడెంలో బృందాలను దించామన్నారు. అలాగే కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 3.15 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వంశధార, నాగావళి నదుల వరద ప్రవాహంతో గొట్టా బ్యారేజీ వద్ద ఔట్ ఫ్లో 30,712 క్యూసెక్కులుగా ఉందని ఆయన తెలిపారు. వరద ప్రవాహం తగ్గేంత వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.


Tags:    

Similar News