గోదావరికి పెరుగుతున్న నీటి మట్టం
ఉధృతంగా గోదావరి నది వరద ప్రవాహం కొనసాగుతుంది. ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు
ఉధృతంగా గోదావరి నది వరద ప్రవాహం కొనసాగుతుంది. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. కూనవరం వద్ద నీటిమట్టం 20.08మీటర్లుగా ఉంది. పోలవరం వద్ద 12.68మీటర్లు, ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12,11,438 క్యూసెక్కులు గా ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.
ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద...
గోదావరి నది ధవళేశ్వరం ప్రాజెక్టు వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 12.50 నుంచి 13 లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహం చేరే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. గోదావరి నదీపరీవాహక ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు కోరారు.