పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది
గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 35.6అడుగుల నీటిమట్టం ఉండగా, కూనవరం వద్ద నీటిమట్టం 14.9మీటర్లుగా ఉంది. పోలవరం వద్ద 10.23 మీటర్లు , ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 5.57 లక్షల క్యూసెక్కులుగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
లోతట్టు ప్రాంతాల ప్రజలు...
వరద హెచ్చరిక స్థాయికు చేరనప్పటికీ దిగువకు నీటిని విడుదల చేస్తున్నందున గోదావరి, కృష్ణా, తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతంలోని లంకగ్రామాలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారుల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.