Godavari : గోదావరికి పెరిగిన వరద నీరు.. అధికారులు అప్రమత్తం
గోదావరికి వరద ఉధృతి పెరిగింది . భద్రాచలం వద్ద గోదావరి కి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది
గోదావరికి వరద ఉధృతి పెరిగింది . భద్రాచలం వద్ద గోదావరి కి రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ముంపు ప్రాంతాలలో ప్రజలను తరలించేందుకు బోట్లు, గజ ఈతగాళ్ళను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేశారు. ముంపునపు గురయ్యే దిగువ ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
రెండో ప్రమాద హెచ్చరిక...
అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని, వరదల కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలు ఎవ్వరు నదిలోకి వెళ్లవద్దు..ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయరాదని పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేయాలని, గోదావరి నది పరివాహక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అధికారులతో సహకరించి సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని, వరద ప్రభావిత గ్రామాలలోని గర్భిణీలు పిల్లలు విభిన్న ప్రతిభావంతులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు.