నేడు రెండోరోజు వంశీ విచారణ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విచారణ నేడు రెండో రోజు కొనసాగనుంది
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విచారణ నేడు రెండో రోజు కొనసాగనుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విచారణ జరగనుంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం వల్లభనేని వంశీని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న పోలీసులు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారించారు.
మరో ఇద్దరు నిందితులను...
అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆయనను తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. ఆయనతో పాటు వంశీ న్యాయవాదిని కూడా విచారణ సందర్భంలో అనుమతించారు. గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా నిన్న అదే పోలీస్ స్టేషన్ లో ప్రశ్నించారు. నేడు రెండో రోజు వంశీని పోలీసులు విచారించనున్నారు.