వల్లభనేని వంశీ పిటీషన్ రేపటికి వాయిదా
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైల్లో ప్రత్యేక వసతులు కావాలని వేసిన పిటిషన్ నేడు విచారణ జరిగింది
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైల్లో ప్రత్యేక వసతులు కావాలని వేసిన పిటిషన్ నేడు విచారణ జరిగింది. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెడ్, ఇంటి భోజనం కావాలని పిటిషన్ వేశారు. అయితే ఈపిటీషన్ ను రేపటికి విచారించాలని న్యాయస్థానం నిర్ణయించింది. వంశీ ఆరోగ్య పరిస్థితులపై రిపోర్టు కూడా ఇవ్వాలని కోరింది.
కస్టడీ పిటీషన్ కూడా...
దీంతో పాటు వల్లభనేనివంశీని తమకు పది రోజుల కస్టడీకి అప్పగించాలని కోరింది. అయితే దీనిపై వంశీ తరుపున న్యాయవాది పొన్నవోలు మాత్రం ఫిర్యాదుదారు సత్యవర్థన్ అందుబాటులో ఉన్నందున అతని చేత సీన్ రీ కనస్ట్రక్షన్ చేసుకోవచ్చని, కస్టడీ పిటీషన్ ను అనుమతించవద్దని కోరారు. ఈ పిటీషన్ పై కూడా విచారణను రేపటికి వాయిదా వేశారు.