నేడు వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ పై విచారణ
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ నేడు విచారణకు రానుంది
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటీషన్ నేడు విచారణకు రానుంది. దాదాపు అన్ని కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ వంశీపై నకిలీ పట్టాల కేసు నమోదయింది. దీంతో నూజివీడు కోర్టు పథ్నాలుగు రోజుల పాటు వల్లభనేని వంశీకి రిమాండ్ విధించింది. అయితే తన ఆరోగ్య పరిస్థితులు బాగాలేవని తనకు బెయిల్ ఇవ్వాలని నూజివీడు కోర్టులో పిటీషన్ వేశారు.
వరస కేసులతో...
నకిలీ పట్టాలు సృష్టించారన్న ఈ కేసులో కూడా బెయిల్ వచ్చినా మరొక కేసు కూడా వల్లభనేని వంశీపై రెడీ గా ఉంది. దీంతో వల్లభనేని వంశీ ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే వల్లభనేని వంశీ జైలుకు వెళ్లి మూడు నెలలు దాటిపోయింది. నేడు నూజివీడు కోర్టులో వంశీ బెయిల్ పిటీషన్ పై విచారణ జరగనుంది. మరి తీర్పు ఎలా వస్తుందన్నది చూడాల్సి ఉంది.