VVallabhaneni Vamsi : విజయవాడ జిల్లా జైలుకు వల్లభనేని వంశీ

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. ఆయనకు న్యాయమూర్తి పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించారు

Update: 2025-02-14 01:51 GMT

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. ఆయనకు న్యాయమూర్తి పథ్నాలుగు రోజులు రిమాండ్ విధించారు. దాదాపు ఎనిమిది గంటల పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారించిన పోలీసులు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. దీంతో న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత వల్లభనేని వంశీతో పాఠఉ అతని అనుచరుుల లక్ష్మీపతి, శివరామకృష్ణప్రసాద్ లకు కూడా రిమాండ్ విధించారు. దీంతో వల్లభనేని వంశీని విజయవాడలోని జిల్లా కోర్టుకు తరలించారు.

బెదిరింపులకు పాల్పడి...
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్థన్ ను బెదిరించడమే కాకుండా అతనిని కిడ్నాప్ చేసినట్లు కూడా పోలీసులు ఆరోపించారు. ఈకేసులో ఏ9గా ఉన్న రామును కలవాలని సత్యవర్ధన్ ను బలవంతం చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వంశీకి నేర చరిత్ర ఉందని, అతనిపై పదహారు క్రిమినల్ కేసులున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన అనంతరం వల్లభనేని వంశీని విచారించి అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు.


Tags:    

Similar News