వల్లభనేని వంశీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. హైకోర్టు ఆదేశాలతో విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో వల్లభనేని వంశీని జైలు అధికారులు చేర్చారు. అయితే ఈ నెల 5వ తేదీన సీల్డ్ కవర్ లో వల్లభనేని వంశీ ఆరోగ్యంపై నివేదికను హైకోర్టును జైలు అధికారులు అందించనున్నారు. వల్లభనేని వంశీ గత కొ్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు.
శ్వాసకోశ సమస్యలతో...
శ్వాసకోశ సమస్యలతో ఆయన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దగ్గుతో సతమతమవుతున్నారని, వంశీకి మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టును ఆయన తరుపున న్యాయవాదులు కోరారు. ఇందుకు సంబంధించి ఆయనకు వెంటనే చికిత్స అందేలా ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తమకు వంశీ ఆరోగ్యంపై నివేదికన సీల్డ్ కవర్ లో అందించాలని తెలిపింది. దీంతో ఈ నెల 5వ తేదీన వల్లభనేని వంశీ ఆరోగ్యంపై సీల్డ్ కవర్ లో రిపోర్టును హైకోర్టుకు జైలు అధికారులు అందచేయనున్నారు.