వివేకా హత్య కేసులో నేడు సుప్రీంలో విచారణ
వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సుప్రీంలో పూర్తిస్థాయి విచారణ జరగనుంది
వివేకానందరెడ్డి హత్య కేసులో నేడు సుప్రీంలో పూర్తిస్థాయి విచారణ జరగనుంది. వివేకానందరెడ్డి హత్య జరిగి ఆరేళ్లు దాటుతున్నా ఇంకా నిందితులు ఎవరో తేల్చకపోవడంపైనా, నిందితులందరి బెయిల్ ను రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత పిటీషన్ దాఖలు చేసింది. అయితే వివేకాహత్య కేసులో నేడు మధ్యాహ్నం రెండు గంటలకు సుప్రీం ధర్మాసనం విచారించనుంది.
అన్ని పిటీషన్లపై...
గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి దర్యాప్తు అవసరమా? లేదా చెప్పాలంటూ గతంలో సీబీఐ అధికారులను ఆదేశించిన సుప్రీంకోర్టు, దర్యాప్తు అవసరమైతే ఎందుకో స్పష్టంగా చెప్పాలని కూడా సుప్రీం కోరింది. వివేకా కేసులో నిందితులందరి బెయిల్ రద్దు చేయాలన్న సునీత, సీబీఐ పిటిషన్లు అన్నింటి పై విచారించనున్న సుప్రీం నేడు కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.