గంటలుగా గోరంట్ల మాధవ్ విచారణ.. ఏం జరుగుతుందో?

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

Update: 2025-03-06 11:54 GMT

వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పోక్సో కేసులో అత్యాచార బాధితుల పేర్లు చెప్పడంపై గోరంట్ల మాధవ్ పై మాజీ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేయడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. అత్యాచార కేసులో బాధితుల పేర్లను బహిరంగంగా చెప్పడంపై ఆయనను ప్రశ్నిస్తున్నారు.

విజయవాడ పోలీసుల ఎదుట...
నిబంధనలకు విరుద్ధంగా ఆయన బాధితురాలి పేర్లను ప్రకటించారని చెబుతూ ఈ నెల 2వ తేదీన ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరు కావాలని కోరినప్పటికీ నిన్న వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోతున్నానని చెప్పి రాలేదు. ఈరోజు బెజవాడ చేరుకున్న గోరంట్ల మాధవ్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆయనను కొద్ది గంటల నుంచి విచారణ చేస్తున్నారు.


Tags:    

Similar News