TDP : జగన్ కు బుద్దా వెంకన్న మాస్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన కామెంట్స్ చేశారు

Update: 2025-02-19 07:28 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన కామెంట్స్ చేశారు. విజయవాడలో విధ్వంసం చేయడానికే నిన్న జగన్ వచ్చారని ఆయన ఆరోపించారు. మీడియా సమావేశంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి రౌడీలను తెచ్చి బెజవాడలో అరాచకం సృష్టించాలన్న నిర్ణయంతోనే వచ్చారని ఆయన ఆరోపించారు.

భారీ కుట్రకు...
విజయవాడలో భారీ కుట్రకు వైసీపీ అధినేత జగన్ తెరలేపారని, అయితే ముందుగా పసిగట్టిన పోలీసులు దానిని సమర్థవంతంగా అడ్డుకున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అన్నారు. కేవలం విజయవాడ మాత్రమే కాదు రాష్ట్రంలో ఎక్కడ ఘటన జరిగినా అందుకు జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని జగన్ ను బుద్దా వెంకన్న హెచ్చరించారు.


Tags:    

Similar News