బోనులోకి గన్నవరం కుక్క.. బుద్దా వెంకన్న హాట్ కామెంట్స్
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వల్లభనేని వంశీ అరెస్ట్ పై హాట్ కామెంట్స్ చేశారు
టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వల్లభనేని వంశీ అరెస్ట్ పై హాట్ కామెంట్స్ చేశారు. బోనులోకి గన్నవరం కుక్కను పడేశారంటూ కామెంట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్లు మొరిగిన కుక్క ఇప్పుడు ఏమంటుందని ఆయన ప్రశ్నించారు. అధికారంలో ఉండగా చెలరేగి పోయి వ్యవహరించిన వారు ఊచలు లెక్కపెట్టడం ఖాయమని బుద్దా వెంకన్న అన్నారు.
విర్రవీగిన వాళ్లంతా...
వల్లభనేని వంశీతో పాటు మరో నాలుగైదు కుక్కలు కూడా బోనులోకి వెళ్లాలని బుద్దా వెంకన్న అన్నారు. జగన్ చూసుకుని విర్రవీగిన నేతలందరూ ఊచలు లెక్కపెట్టాల్సిందేనని బుద్దా వెంకన్న అన్నారు. ఇంకా అనేక మంది నేతలు, తమ అగ్ర నేతలపై అవాకులు, చవాకులు పేలిన వారు జైలుకెళ్లడం ఖాయమని బుద్దా వెంకన్న జోస్యం చెప్పారు.