Tadipathri : తాడిపత్రిలో టెన్షన్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తాడిపత్రికి వచ్చేందుకు పెద్దారెడ్డి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రికి పెద్దారెడ్డి వస్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు ఆయన రాకకు అనుమతిని నిరాకరించారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే ఊరుకోబోమని టీడీపీ నేతలు జారీ చేసిన హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
తాడిపత్రికి రాకుండా...
దీంతో తాడిపత్రికి పెద్దారెడ్డి రాకుండా ముందుగానే ఆయన స్వగ్రామంలో అరెస్ట్ చేశారు. అనుమతి లేదని, ఇప్పుడు తాడిపత్రికి రావద్దని పెద్దారెడ్డికి పోలీసులు సూచించారు. అయితే ప్రజాస్వామ్య పద్ధతిలో తాను తాడిపత్రికి వస్తానంటే ఎందుకు అంగీకరించరని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపిస్తున్నారు.