హైకోర్టులో పెద్దారెడ్డికి షాక్
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లేందుకు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది. పెద్దారెడ్డి తాడిపత్రికి వెళితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని అనంతపురం ఎస్పీ ఈ పిటీషన్ ను హైకోర్టులో దాఖలు చేశారు. మొన్ననే హైకోర్టు తీర్పు మేరకు పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లాలని ప్రయత్నించినా పోలీసులు అనుమతించలేదు.
మూడు వారాల పాటు...
దీంతో ఆయన అక్కడే సాయంత్రం వరకూ కూర్చుని నిరసనను వ్యక్తం చేశారు. కానీ పోలీసు అధికారులు తాడిపత్రిలో శాంతి భద్రతలను కాపాడాలంటే పెద్దారెడ్డిని అక్కడకు వెళ్లే ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. దీనిపై విచారించిన డివిజనల్ బెంచ్ తాడిపత్రికి పెద్దారెడ్డి వెళ్లేందుకు అనుమతిస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.