సిట్ విచారణకు ముందు విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ చూస్తే?
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారుల ఎదుటకు విచారణకు హాజరు కానున్నారు.
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేడు ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ అధికారుల ఎదుటకు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈరోజు విచారణకు రావాలని విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇదివరకే ఒకసారి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ చేసిన సిట్ అధికారులు మరోసారి విచారణ చేయాలని నిర్ణయించారు.
కీలక సమాచారం...
తొలి దశ విచారణలో విజయసాయిరెడ్డి ఇచ్చిన ఆధారాలతోనే కీలక నిందితుడైన రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఈరోజు ఈ కేసులో ఇంకా ఎవరి పేర్లను బయటపెడతారన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అయితే సిట్ విచారణ సందర్భంగా విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇంట్రెస్టింగ్ ఉంది. కర్మలను ఆచరించడం యందే నీకు అధికారం కదని, వాటి ఫలితాల మీద లేదని, నీవు కర్మఫలములకు కారణం కారాని, అట్లని కర్మలను చేయడం మానరాదంటూ భగవద్గీత శ్లోకాన్ని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేయడం చర్చనీయాంశమైంది.