రేపు సీఐడీ విచారణకు విజయసాయిరెడ్డి

మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రేపు సీఐడీ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది

Update: 2025-03-11 04:22 GMT

మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రేపు సీఐడీ పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. రేపు విచారణకు రావాలని ఇప్పటికే మంగళగిరి సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీల విషయంలో విజయసాయిరెడ్డిపై కేవీ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదయింది. దీంతో ఆయనను విచారణకు రేపు రావాలని పిలిచారు.

హాజరవుతారా? లేదా?
అయితే రేపు విజయసాయిరెడ్డి హాజరవుతారా? లేదా? అన్న ది తేలలదేు. ఉదయం పదకొండు గంటలకు మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ కేసులో విచారణకు సహకరించేందుకు ఆయన వస్తారా? రారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుని వ్యవసాయం చేసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.


Tags:    

Similar News