శైలజానాధ్ వైసీపీలో చేరిన తర్వాత ఫస్ట్ కామెంట్స్ ఏంటో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ వైసీలో చేరారు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాధ్ వైసీలో చేరారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. వైఎస్ జగన్ సాకే శైలజానాధ్ కు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సాకే శైలజానాధ్ మీడియాతో మాట్లాడుతూ తాను జగన్ విధానాలు నచ్చడం వల్లనే పార్టీలో చేరానని తెలిపారు.
ప్రజాసమస్యల కోసం...
ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న వైసీపీ అంటే తనకు ఇష్టమని ఆయన అన్నారు. వైఎస్ జగన్ రాజకీయ విధానాలు నచ్చడం వల్లనే తాను వైసీపీలో చేరానన్న సాకే శైలజానాధ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కక్ష సాధింపు చర్యలకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా తాను పార్టీలో పనిచేస్తానని సాకే శైలజానాధ్ తెలిపారు.