పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. ఈసారి ఎవరంటే?
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్.వి.ఎస్.ఎస్.వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి లోకేశ్ నాయకత్వం అవసరమని తెలిపారు. టీడీపీకి లోకేశ్ ను రధసారధిగా నియమించాలని వర్మ డిమాండ్ చేశారు. గత ఎన్నికలకు ముందు లోకేశ్ చేసిన యువగళం పాదయాత్ర కారణంగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వర్మ అన్నారు.
లోకేశ్ నాయకత్వంలో...
లోకేశ్ నాయకత్వంలో పార్టీ మరిన్ని విజయాలను అందుకుంటుందని వర్మ ఆకాంక్షించారు.టీడీపీకి భవిష్యత్ తరంనాయకులు ఉండాలన్న వర్మ, టీడీపీకి 2047 ప్రణాళిక కూడా అవసరమని వర్మ అభిప్రాయపడ్డారు. లోకేశ్ కారణంగానే యువత పార్టీ వైపు ఆకర్షితులవ్వడం కాకుండా, అన్ని వర్గాల ప్రజలు ఏకమవ్వడానికి కారణమయ్యారని వర్మ అన్నారు.