జక్కంపూడి రాజా హౌస్ అరెస్ట్
మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజమండ్రి పేపర్‌మిల్లు కార్మికుల సమస్యలపై.. ఈరోజు నిరవధిక దీక్ష చేపడతానన్న జక్కంపూడి రాజా ప్రకటించారు. అయితే శాంతి భద్రతల సమస్య కారణంగా ఎలాంటి నిరాహార దీక్షలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయినా ఈరోజు ఉదయం జక్కంపూగి రాజా నిరాహారదీక్షకు సిద్ధమయ్యారు.
పేపర్ మిల్లు సమస్యలపై...
నిరాహార దీక్షకు సిద్ధమైన జక్కంపూడి రాజాను బలవంతంగా తరలించి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వస్తుండటంతో వారిని అదుపు చేస్తున్నారు. ఎవరికీ అనుమతి లేదని, 144వ సెక్షన్ అమలులో ఉందని పోలీసులు తెలిపారు. జక్కంపూడి రాజా ప్రస్తుతం పోలీసుల పహారా మధ్య ఇంట్లోనే ఉన్నారు.