Andhra Pradesh : నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రులు

నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుటకు మాజీ మంత్రులు విడదల రజని, అంబటి రాంబాబులు హాజరు కానున్నారు

Update: 2025-07-21 02:27 GMT

నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుటకు మాజీ మంత్రులు విడదల రజని, అంబటి రాంబాబులు హాజరు కానున్నారు. సత్తెనపల్లి పోలీసులు ఇప్పటికే ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటనలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, నిబంధనలు అతిక్రమించారని ఇద్దరు మాజీ మంత్రులపై కేసు నమోదు చేశారు.

పోలీసుల విధులకు...
అంబటి రాంబాబు, విడదల రజనీలను నేడు విచారించనున్నారు. సత్తెనపల్లి పోలీసులు ఈ మేరకు నోటీసులు జారీ చేయడంతో ఇద్దరు నేతలు నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణకు హాజరు కానున్నారు. రెంటపాళ్ల పర్యటనలో జగన్ కాన్వాయ్ లో ప్రమాదంతో పాటు పోలీసుల విధులను అడ్డుకోవడంపై ఇరువురిని ప్రశ్నించనున్నారు.


Tags:    

Similar News