ఏపీ ముస్సోలిని.. జగన్..తరిమికొట్టడం తథ్యం

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు

Update: 2022-08-26 06:05 GMT

వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఏపీ ముస్సోలినిగా మారారన్నారు. నియంతలా వ్యవహరిద్దామనుకున్న వారు చరిత్రలో కనుమరుగయ్యారని యనమల మండి పడ్డారు. కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటపై వైసీపీ గూండాల దాడి పిరికి పంద చర్యగా యనమల అభివర్ణించారు. పిరికి పందలే ఇటువంటి చర్యలను ప్రోత్సహిస్తారని అన్నారు. ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం దేశంలో ఏపీలో తప్ప మరే రాష్ట్రంలో లేదన్నారు. జగన్ రెడ్డి రాష్ట్రంలో రౌడీయిజానికి రెక్కలు తొడిగారని యనమల ఫైర్ అయ్యారు.

అక్రమ కేసులు బనాయించి...
ప్రతిపక్ష కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయాలని భావిస్తున్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. జగన్ రెడ్డి రాక్షస పాలనను అంతమొందించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. ఇటలిలో ఫాసిజం సృష్టికర్త ముస్సోలినికి పట్టిన గతే జగన్ కు పడుతుందన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం మానుకోవాలన్నారు. లేకుంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు. ఏపీలో బతకటం కంటే ఉక్రెయిన్ లో బతకటం మేలని ఏపీ ప్రజలు భావిస్తున్నారని యనమల ఫైర్ అయ్యారు. జగన్ కు వచ్చే ఎన్నికలలో సింగిల్ డిజిట్ స్థానాలు కూడా రావని ఆయన జోస్యం చెప్పారు.


Tags:    

Similar News